Current Affairs Telugu Daily

హరియాణా ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణం
* హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
* చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో అక్టోబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఖట్టర్‌తో హరియాణా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు.
* జననాయక్‌ జనతా తో పొత్తులో భాగంగా ఆ పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
* 90 స్థానాలు గల అసెంబ్లీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 40 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్‌ 31 స్థానాల్లో, జెజెపి 10 స్థానాల్లో, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు. 
* బీజేపీ నేత, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రోహ్‌తక్ జిల్లా మహమ్ తెహసిల్‌లోని నిదాన గ్రామంలో 1954 మే 5న జన్మించారు.
* ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1977లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.
* 1980 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పని చేశారు. 
* 1994లో బీజేపీలో చేరి 2014లో మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 
* మొదటిసారిగా 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

views: 645



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams