Current Affairs Telugu Daily

భవిష్యత్ పెట్టుబడుల సదస్సు(ఎఫ్‌ఐఐ) లో ప్రధాని నరేంద్ర మోదీ
* భారత ప్రధాని నరేంద్ర మోదీ  సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అక్టోబర్ 29న నిర్వహించిన భవిష్యత్ పెట్టుబడుల సదస్సు(ఎఫ్‌ఐఐ) 2019 లో పాల్గొన్నారు.
* వచ్చే ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకున్న భారత్‌లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
* దేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ సౌదీ అరేబియా కంపెనీలను ఆహ్వానించారు.
* ఈ రంగంలో 100 బిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్‌ పెట్టుబడుల సదస్సు(ఎఫ్‌ఐఐ) 2019లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. మౌలిక రంగంపై రూ. 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మోదీ చెప్పారు. 
* వచ్చే 3–4 ఏళ్లలో 40 కోట్ల మందిని వివిధ రంగాల్లో సుశిక్షితులుగా తీర్చిదిద్దనున్నామని ఆయన పేర్కొన్నారు.  

views: 638



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams