Current Affairs Telugu Daily

సీపీఐ నేత గురుదాస్‌ దాస్‌గుప్తా కన్నుమూత
సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు.
* గురుదాస్‌ దాస్‌గుప్తా 25ఏళ్ల పాటు పార్లమెంటేరియన్‌గా ఉన్నారు. 
* 1985, 1988, 1994లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 
* 2004లో బెంగాల్‌లోని పాంక్‌సుడా నియోజకవర్గం నుంచి, 
* 2009లో ఘాటాల్‌ నుంచి ఆయన లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 
* 2009 నుంచి సీపీఐ తరఫున లోక్‌సభా పక్ష నేతగా వ్యవహరించారు. 
* 2001లో ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(ఏఐటీయూసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 
* ‘సెక్యూరిటీస్‌ స్కాండల్‌-ఏ రిపోర్ట్‌ టు ది నేషన్‌’ అనే పుస్తకం కూడా రచించారు.
* గురుదాస్‌ దాస్‌గుప్తా 1936 నవంబర్ 3న బారిసాల్‌లో జన్మించారు.

views: 592



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams