Current Affairs Telugu Daily

తెరపైకి  లాలుప్రసాద్ జీవిత చరిత్ర
* రాష్ట్రీయ జనతా దళ్‌ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ జీవితగాథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.
* ఆర్జేడీ ఎన్నికల గుర్తు అయిన లాల్‌టెన్ (లాంతర్) పేరుతో రాబోతున్న ఈ సినిమాలో భోజ్‌పురి చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు యశ్‌కుమార్.. లాలుప్రసాద్ పాత్ర పోషించనున్నారు.ఆయన భార్య రబ్రీదేవిగా స్మృతి సిన్హా నటించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది.
* ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందు రానుందని నటుడు యశ్‌ కుమార్‌ తెలిపారు. 
* లాలూ పార్టీ ఆర్జేడీ గుర్తు లాంతరు  
* ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీపై ‘పీఎం నరేంద్రమోదీ’, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’, బాల్‌థాకరేపై ‘ఠాక్రే’ వంటి సినిమాలు వచ్చాయి.  

views: 620



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams