Current Affairs Telugu Daily

ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ

ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ జోడీ ప్రతిభ కనపరిచింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్-750 టోర్నీలో రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం రజత పతకం చేజిక్కించుకుంది.ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత జోడి సాత్విక్‌-చిరాగ్‌ జోడి రన్నరప్‌గా నిలిచింది.
*పురుషుల డబుల్స్ తుదిపోరులో సాత్విక్-చిరాగ్ జంట 18-21, 16-21తో టాప్ సీడ్ మార్కస్ ఫెర్నాల్డి-కెవిన్ సంజయ (ఇండోనేషియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
*ఇటీవల థాయ్‌లాండ్ ఓపెన్ ద్వారా తొలి సూపర్-500 టైటిల్ నెగ్గిన భారత ద్వయం ఇక్కడ గెలవలేక పోయింది.
*  పార్థో గంగూలీ-విక్రమ్ సింగ్ (1983) జంట తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన సాత్విక్ ద్వయం టైటిల్‌ను గెలవలేక పోయింది.
*36 ఏండ్ల క్రితం గంగూలీ-విక్రమ్ జోడీ డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గగా.. అప్పటి నుంచి మరే భారత జంట ఆ ఘనత సాధించలేకపోయింది.
*పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ (2017) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలువగా.. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2012) ఫైనల్ చేరింది.
*మూడుసార్లు ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్‌  మహిళల సింగిల్స్ ఫైనల్లో మారిన్ 17 ఏండ్ల కొరియా అమ్మాయి చేతిలో పరాజయం పాలైంది.
*రుషుల సింగిల్స్ విభాగంలో చెన్ లాంగ్ (చైనా) 21-19, 21-12తో జొనాథన్ క్రిస్టి (ఇండోనేషియా)పై నెగ్గి టైటిల్ సాధించాడు.


views: 655



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams