Current Affairs Telugu Daily

భారత్ ఫ్రాన్స్ సైనిక  విన్యాసాలు - శక్తి 2019

*ఎక్సర్సైజ్ శక్తి - 2019,భారత్ మరియు ఫ్రాన్స్ ఆర్మీ ల మధ్య జరిగే ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు ఎక్సర్సైజ్ శక్తి. 
* ఎప్పుడు --అక్టోబర్ 31 నుండి నవంబర్ 13 వరకు 
*రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఉన్న ఫారెన్ ట్రైనింగ్ నోడ్ లో ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. 
* ఐక్యరాజ్యసమితి కార్యక్రమం  ప్రకారం,తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల నిర్వాహణ ను సూచించే విధంగా అర్థ శుష్క ప్రాంతం(semi-desert terrain) లో దీనిని నిర్వహిస్తున్నారు. 
* ఈ సైనిక విన్యాసాలు ముఖ్యంగా అధిక స్థాయిలో శారీరక దృఢత్వం పై,విపత్కర పరిస్థితుల్లో పాటించవలసిన చర్యలను నేర్చుకునే విధంగా డ్రిల్స్ నిర్వహణ, ఇరుదేశాలు పరస్పరం మార్చుకోడానికి ఉపయోగపడతాయి. 
*శక్తి అనే సైనిక విన్యాసాలు భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య  2011 లో ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల సైన్యం మధ్య సహకారం,సంబంధాల బలోపేతానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. 
ప్రాన్స్ -ఫ్రాన్స్ లేదా అధికారికంగా ఫ్రెంచ్ గణతంత్రం, పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది.ఫ్రాంసుకు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి. ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది.
ఫ్రాన్స్ ప్రధాన భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది.
*దేశ సరిహద్దులుగా (ఉత్తరం నుండి) బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, మొనాకో, స్పెయిన్, అండొర్రా ఉన్నాయి. ఫ్రాన్స్ సుదూర భూభాగాల భూసరిహద్దులలో బ్రెజిల్, సురినామ్ (ఫ్రెంచ్ గయానాతో సరిహద్దు కలది), నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ (సెయింట్-మార్టిన్‌తో సరిహద్దు కలది)లు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అడుగు నుండి పోయే ఛానల్ టన్నల్ ద్వారా యునైటెడ్ కింగ్డంతో కలుపబడింది.       
*ఫ్రాన్స్ వైశాల్యపరంగా ఐరోపా సమాఖ్యలో అతి పెద్దదేశంగానూ అలాగే ఐరోపాలో ( రష్యా, ఉక్రెయిన్ల తరువాత) 3 వ స్థానంలో ఉంది. ఐరోపాయేతర భూభాగాలైన ఫ్రెంచ్ గయానా వంటి వాటిని కలిపితే అది 2 వ స్థానంలో ఉండేది. 


views: 702



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams