Current Affairs Telugu Daily

జమ్మూ కాశ్మీర్ లో యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందం

* జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. 
*జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి అక్టోబర్ 29న ఈ బృందం వారు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించనున్నారు.
* బృందం సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.
*ఇప్పటిదాకా బీజేపీ, ఎన్డీయేతర రాజకీయ పార్టీల నాయకులను జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
*జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్డుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులు మొన్నటి దాకా కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు.జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్ స్థాయి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే ఆయా నాయకులపై విధించిన ఆంక్షలను సడలించింది. 
* 28 మంది యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు జమ్మూ-కాశ్మీర్ పర్యటనలో పాల్గొంటారు. 
* ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత.. జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కులు పూర్తిగా అణచివేతకు గురయ్యాయని, సామాన్య ప్రజలు గడప దాటి బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అంటూ పాకిస్తాన్ ఆరోపిస్తూ వస్తుంది. 
* జమ్మూ కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుని రావడానికే కేంద్రం యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందాన్నిఆహ్వానించారు. 


views: 696



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams