Current Affairs Telugu Daily

 పాక్ గగనతలంలో VVIP లకు నిరాకరణ

ప్రధాని నరేంద్ర మోదీ  సౌదీ అరేబియా పర్యటన నేపథ్యంలో  మోదీ ప్రయాణం చేసే విమానాన్ని పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లేందుకు  ఆదేశం అంగీకరించలేదు.
* పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ- జమ్మూ కశ్మీర్‌లో మానవహక్కులను ఉల్లంఘించిన అందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
* అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్టోబర్ 28న  సౌదీ పర్యటన ఉంది.
*గత నెలలో మోదీ అమెరికా పర్యటన, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐస్‌ల్యాండ్‌ పర్యటన సందర్భాల్లోనూ పాక్‌ ఇదే రీతిలో వ్యవహరించింది.
*బాలాకోట్‌ దాడుల తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది.తిరిగి కొంతకాలం తర్వాత తెరిచింది. మళ్ళీ ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ భారత్‌కు చెందిన విమానాలను రానీయకుండా తమ గగనతలాన్ని మరోసారి మూసివేసింది. 
*గగనతల వినియోగం విషయంలో పాక్ అవలంభిస్తున్న ఏకపక్ష వైఖరిపై అంతర్జాతీయ సంస్థకు భారత్ ఫిర్యాదు చేయనుంది. మన దేశంలో వీవీఐపీలైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌లు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణిస్తున్న విమానాలు తన గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించని పాక్ తీరుపై  గ్లోబల్ సివిల్ ఏవియేషన్ బాడీ అయిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ లో భారతదేశం ఫిర్యాదు చేయనుంది. 
* వీవీఐపీ అయిన మోదీ ప్రత్యేక విమానానికి ఓవర్‌ఫ్లైట్ క్లియరెన్స్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరించడం భారత్ తీవ్రంగా పరిగణించింది.
*అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాల ప్రకారం వీవీఐపీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా తమ దేశాల గగనతలాన్ని వాడుకునేందుకు ఏ దేశమైన మామూలుగా మంజూరు చేయాలి.
*అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ చార్టర్ ప్రకారం, యుద్ధం జరిగేటపుడు తప్ప,గగనతల వినియోగాన్ని తిరస్కరించడం ఏ దేశమూ చేయకూడదు. దీన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు భారీ జరిమానా విధించవచ్చు.
*మొదటిసారి సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి ప్రధాని మోదీ న్యూయార్క్ వెళుతుండగా పాక్ అనుమతి నిరాకరించింది.
ఆగస్టు నెల తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం(సౌదీ అరేబియా పర్యటనకు ) ఉపయోగించుకునేందుకు అనుమతించక పోవడం రెండోసారి. 


views: 694



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams