Current Affairs Telugu Daily

జర్మనీ చాన్స్లర్  భారత్ పర్యటన 

*నవంబర్ 1 2019లో జరిగే  ఐదవ ద్వైవార్షిక ఇంటర్ గవర్నమెంట సమావేశానికి జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కల్ భారత్ లో పర్యటించనున్నారు. 
*ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ తో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య సాంప్రదాయ రంగాలైన నైపుణ్య అభివృద్ధి,రవాణా,విద్యుత్ రంగాలపై చర్చలు చేపడతారు.  
*యూరప్ లో భారత్ కి  అతి అతిపెద్ద వాణిజ్య  దేశం జర్మనీ. 
* 2018-19 లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం $ 8.9 బిలియన్లు.ఇదే సంవత్సరంలో జర్మనీ నుండి భారత్ కు జరిగిన దిగుమతుల విలువ $15.16 బిలియన్లు. 
* 600 పైగా ఇండో జర్మన్ జాయింట్ వెంచర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 
*జర్మనీ పెట్టుబడులు భారతదేశంలో ముఖ్యంగా  రవాణా, ఖనిజాల పరిశ్రమలు,రసాయనాలు, నిర్మాణ  రంగం,ఆటో మొబైల్స్ రంగాల్లో ఉన్నాయి.  
*జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్యగా మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్సు, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ ఉన్నాయి. జర్మనీ భూభాగం సమశీతోష్ణ వాతావరణంచే ప్రభావితం చేయబడుతుంది. 82 మిల్లియన్ల నివాసితులతో ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశంగా లెక్కింపబడింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వచ్చిన వలస ప్రజలకు మూడవ అతిపెద్ద నివాసదేశంగా ఉంది.


views: 644Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams