Current Affairs Telugu Daily

హార్వర్డ్‌కు గురుకుల విద్యార్థి ఆనంద్‌
ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాయం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి మాశగల్ల  ఆనంద్‌ ఎంపికయ్యాడు. అకడమిక్‌
ప్రొఫైల్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో శిక్షణకు ఎంపిక
చేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఆసియా నుంచి దాదాపు 2,500 మంది విద్యార్థులు
ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 40 మంది ఎంపికయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమం
త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కానుంది. అనంతరం ఆయా విద్యార్థుల వర్సిటీలో
గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు ప్రవేశాలు కల్పిస్తారు. మాశగల్ల ఆనంద్‌ సొంతూరు వికారాబాద్‌
జిల్లా పూడూరు మండలం. అమ్మ రత్నమ్మ, నాన్న కాశయ్య ఇద్దరూ వ్యవసాయ కూలీలు . 
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ` ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ 

views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams