Current Affairs Telugu Daily

కర్తార్‌పూర్‌ కారిడార్ ఒప్పందం

*కర్తార్‌పూర్‌ కారిడార్‌కు సంబంధించిన చారిత్రాత్మక ఒప్పందంపై భారత్‌, పాకిస్థాన్‌ సంతకాలు చేశాయి.ఈ ఒప్పందం మేరకు భారత్‌కు చెందిన యాత్రికులు వీసా లేకుండానే పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా ప్రదేశాన్ని సందర్శించవచ్చు.సిక్కుల తొలి గురువు గురునానక్‌ తన చివరి 18 సంవత్సరాలను కర్తార్‌పూర్‌లోనే గడిపారు.
*అంతర్జాతీయ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల అవతల పాకిస్థాన్‌లోని నరోవాల్‌ జిల్లాలోగల కర్తార్‌పూర్‌ దర్బార్‌ సాహిబ్‌కు భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో గల డేరాబాబా నానక్‌ గురుద్వారాకు మధ్య కారిడార్‌ను నిర్మించారు. 
* కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌సీఎల్‌ దాస్‌, పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైజల్‌ కర్తార్‌పూర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. 
* ఆ ప్రదేశాన్ని ఇప్పుడు అన్ని మతాలకు చెందిన భారతీయులు వీసా లేకుండానే సందర్శించవచ్చు. 
* ఈ కారిడార్‌ ద్వారా వచ్చే సిక్కులను పాకిస్థాన్‌లోని ఇతర గురుద్వారాలు సందర్శించేందుకు పాకిస్థాన్ అనుమతించదు.
*నవంబర్‌ 12న గురునానక్‌ దేవ్‌ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్‌ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ భారత్‌ - పాక్‌లు సంయుక్తంగా ప్రారంభించనున్నాయి.
*ఒప్పందం వివరాలు -- కర్తార్‌పూర్‌ వెళ్లే యాత్రికులు తమ వద్ద తప్పనిసరిగా పాస్‌పోర్ట్‌ను ఉంచుకోవాలి. భారత సంతతికి చెందిన ప్రవాసులు మాత్రం ప్రవాస భారతీయ పౌరసత్వం (ఓసీఐ) కార్డుతోపాటు పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలి. 
* యాత్రికులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని, తమకిష్టమొచ్చిన రోజున ప్రయాణించవచ్చు.
*యాత్రికులు తమతోపాటు గరిష్ఠంగా రూ.11వేల వరకు నగదు, ఏడు కిలోల బరువు వరకు సరుకులు, సామగ్రితో కూడిన సంచిని మాత్రమే తీసుకెళ్లాలి. యాత్రా స్థలాన్ని దాటి ఎవరూ అవతలికి వెళ్లడానికి ప్రయత్నించకూడదు.
*కారిడార్‌ను అన్ని వేళలా తెరిచే ఉంచుతారు. ప్రతిరోజు ఐదువేల మంది భారతీయులను మాత్రమే అనుమతిస్తారు. వారు ఉదయం వెళ్లి సాయంత్రంలోగా తిరిగి రావాలి.
*ప్రతి యాత్రికుడు కర్తార్‌పూర్‌ వెళ్లడానికి 20 డాలర్లు (సుమారు రూ.1400) రుసుము చెల్లించాలి.
*సర్వీస్ చార్జీ వల్ల పాక్ ప్రభుత్వానికి ఏడాదికి  259 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 


views: 699



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams