Current Affairs Telugu Daily

ప్రపంచ బయో ఇండియా సదస్సు-2019

*భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ బయో ఇండియా సదస్సు నవంబర్ 21 నుండి 23 వరకు జరగనుంది. 
* దీనిని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్  కౌన్సిల్ మరియు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ  వారు నిర్వహిస్తారు. 
* భారతదేశంలోకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు, దేశం యొక్క అనుకూల అంశాలను ప్రదర్శించడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు. 
* మేక్ ఇన్ ఇండియా  2.0 లో భాగంగా బయోటెక్నాలజీ ని  కీలక అంశంగా గుర్తించారు. 
* ఈ కార్యక్రమంలో 30 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు.స్టార్ట్ అప్ ల  ప్రదర్శన నిర్వహిస్తారు. 
*5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా  భారత్ ఎదగడానికి బయో టెక్నాలజీ రంగం కీలకం.దేశ జి.డి.పి పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది. 
*దేశాల మధ్య బయోటెక్నాలజీ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి కొరకు నిధులు మరియు సహకారం పెంపొందించడానికి ఈ సదస్సులో ఉపయోగపడుతుంది. 
* అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి సదస్సు ఉపయోగపడుతుంది. 
* బయో అగ్రికల్చర్, బయో ఎనర్జీ, బయో ఇండస్ట్రియల్,బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో సర్వీసెస్ వంటి అంశాలపై దృష్టి పెడతారు.


views: 717



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams