Current Affairs Telugu Daily

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు పర్యవేక్షణ మొబైల్ అప్లికేషన్ 

*కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు CPCB E-Inspection మొబైల్ అప్లికేషన్ ను రూపొందించి అభివృద్ధి చేసింది.పరిశ్రమలను లైవ్ వీడియో రూపంలో పర్యవేక్షించేందుకు ఈ మొబైల్ అప్లికేషన్ ను రూపొందించారు.
*కాలుష్యాన్ని కలుగజేసే పరిశ్రమలపై నియంత్రణ చేపట్టేందుకు ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. 
*కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం  ఈ మొబైల్ అప్లికేషన్ ను రూపొందించింది. దీనిని కేవలం బోర్డు అంతర్గతంగా ఉపయోగించి పర్యవేక్షిస్తుంది. 
* నేరుగా అధికారులు వెళ్లి పరిశ్రమలను పర్యవేక్షించే కుండా ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. 
*మారుమూల ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను కూడా పర్యవేక్షించేందుకు  ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. 
*పర్యవేక్షణను ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా అనుమతించే పరిశ్రమలు బోర్డుకు వీలైన తేదీల్లో రిక్వస్ట్ పెట్టవచ్చు.  


views: 662



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams