Current Affairs Telugu Daily

టెలికాం కంపెనీల కేసు

సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు లభించింది. టెలికాం శాఖ (డాట్‌) వాదనను సమర్థించింది.
* జస్టిస్‌ ఆరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 
*దీంతో లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీల (ఎస్‌యూసీ) రూపంలో కంపెనీలపై రూ.1.34 లక్షల కోట్ల చెల్లింపుల భారం పడనుంది.
* లైసెన్సు ఫీజు కింద చెల్లించాల్సిన బకాయిల భారం రూ.92,000 కోట్ల వరకు ఉంటుంది.వడ్డీ, జరిమానాతో సహా ఈ మొత్తాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  
*ప్రతి టెలికాం కంపెనీ ఏటా తనకు వచ్చే ఏజీఆర్‌లో 8 శాతం లైసెన్సు ఫీజుగా, 3 శాతం ఎస్‌యూసీగా టెలికాం శాఖకు చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ నిర్వచనంపై 2005 నుంచి టెలికాం వివాదాల అప్పీళ్ల ట్రైబ్యునల్‌ (టీడీశాట్‌), హైకోర్టులు, సుప్రీం కోర్టుల్లో కేసు విచారణ జరుగుతోంది. 
* అద్దెలు, డివిడెండ్‌ ఆదాయం, వడ్డీ ఆదాయం, స్థిరాస్తుల అమ్మకంపై వచ్చే లాభాల వంటి నాన్‌-టెలికాం కార్యకలాపాల ఆదాయాన్ని ఏజీఆర్‌లో కలపకూడదని కంపెనీల వాదన. 
*డాట్‌ మాత్రం ఈ ఆదాయాలు కూడా ఏజీఆర్‌ పరిధిలోకే వస్తాయని వాదిస్తోంది. 
*దీంతో కంపెనీలు డాట్‌ డిమాండ్‌ చేసిన మొత్తంలో 85 శాతం చెల్లిస్తూ, మిగతా 15 శాతాన్ని పెండింగ్‌లో పెట్టాయి. 
*టీడీశాట్‌, హైకోర్టుల్లో తీర్పు కంపెనీలకే అనుకూలంగా వచ్చింది.సుప్రీం కోర్టులో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చింది. 
* రోమింగ్‌ చార్జీలు, టెర్మినేషన్‌ ఫీజు మినహా మిగతా అన్ని ఆదాయాలు ఏజీఆర్‌ పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 


views: 636



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams