Current Affairs Telugu Daily

తేజస్ కొరకు భారత వాయుసేన HAL  తో ఒప్పందం 

*భారత వాయుసేన 83 తేజస్ లైట్ కాంబాట్  ఎయిర్ క్రాఫ్ట్ (LCA) ల కొనుగోలుకు  హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకోనుంది.
*2017 డిసెంబర్ లో భారత వాయుసేన దీనికి సంబంధించిన  టెండర్ సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించింది. 
*ఈ ఒప్పందం విలువ  రూ.45,000కోట్లు ఉంటుంది. 
*తేజస్ --తేజస్ భారతదేశం అభివృద్ధి చేస్తున్న ఒక బహుళ ప్రయోజనకర తేలికపాటి యుద్ధ విమానం. దీనికి విమానపు తోక భాగం ఉండదు.  మిశ్రమ డెల్టా వింగ్ (సమద్విబాహు త్రిభుజం ఆకారంలో ఉండే రెక్కలు) నమూనాతో ఒక ఇంజిన్ ఆధారంగా నడుస్తుంది. మొదట దీనిని తేలికపాటి యుద్ధ విమానం (LCA) గా పిలిచేవారు-ఇప్పటికీ ఎక్కువగా ఇదే పేరుతో పిలవడం కొనసాగుతోంది-2003 మే 4 న అప్పటి ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి ఈ యుద్ధ విమానానికి అధికారికంగా "తేజస్ " అని నామకరణం చేశారు.తేజస్ విమానాల ఉత్పత్తి 2007లో ప్రారంభమైంది.


views: 640



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams