Current Affairs Telugu Daily

అలీన దేశాల సదస్సులో పాల్గొననున్న వెంకయ్యనాయుడు

ఈ ఏడాది అలీనోద్యమ వార్షిక సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి బదులు ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హజరవుతున్నారు. 
*ఈ సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడం ఇది రెండోసారి. నామ్ సదస్సుకు హాజరుకాని తొలి భారత ప్రధాని మోదీ.వెనుజులా వేదికగా 2016లో జరిగిన 17 వ నామ్ సదస్సుకు మోదీ హాజరుకాలేదు.
*అక్టోబర్ 25 నుండి 26 మధ్య అలీన దేశాల సదస్సు( NAM) బాకు ,అజర్బైజాన్ లో జరుగుతుంది. ఇది 18 వ NAM సదస్సు. 
* ఇతివృత్తం/థీమ్ -నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు - బాండంగ్‌ సూత్రాలు అమలు చేయాల్సిన సందర్భం’
*చర్చించే అంశాలు- ఉగ్రవాదం, శాంతి భద్రతలకు ఎదురవుతున్న సవాళ్లు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు.
*ఈ పర్యటనలో అజర్‌బైజాన్‌ సహా పలు నామ్‌ సభ్య దేశాల ప్రతినిధులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 
*నేపాల్ ప్రధాని ఓలి ,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా  ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నేపాల్ NAM స్థాపించినప్పటి నుండి ఉన్నసభ్య దేశం. 
*రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు ఏర్పడ్డాయి. ఇవి వర్ధమాన దేశాలపై తమ తమ కూటములలో చేరాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి చెందుతున్న మరియు చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం (Non-Aligned Movement) ఆవిర్భవించింది.
*దీనికి పితామహుడు భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.1961 లో  బెల్గ్రేడ్ ,సెర్బియా లో ఏర్పాటయింది. 
*ప్రస్తుతం నామ్ ప్రాధాన్యత, ప్రయోజనాలు బాగా తగ్గాయి. ఇందులోని సభ్యదేశాలకు విదేశాంగ విధానంలో పూర్తి స్వాతంత్రం ఉంది. దీంతో సభ్యదేశాల వైఖరిలో మార్పులు చోటుచేసుకున్నాయి.
*1979 నామ్ శిఖరాగ్ర సమావేశానికి నాటి ప్రధాని చరణ్ సింగ్ కూడా హాజరుకాలేదు. కానీ, ఆయన అప్పటికి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. 
*అలీనోద్యమ స్థాయి నుంచి అగ్రగామి దేశంగా భారతదేశం రూపాంతరం చెందుతుందనడానికి ఇది సంకేతం.
*అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 
*1955 లో ఇండోనేషియాలో బాండంగ్‌ జరిగిన సదస్సులో      బాండంగ్‌ పది సూత్రాలను ఆసియా మరియు ఆఫ్రికా దేశాల కొరకు రూపొందించుకున్నాయి.  


views: 966



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams