Current Affairs Telugu Daily

బీసీసీఐ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేపట్టిన దాదా 

* మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ బీసీసీఐ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు.65 ఏళ్ల త‌ర్వాత ఓ మాజీ క్రికెట‌ర్ బీసీసీఐ బోర్డు ప‌గ్గాలు చేప‌ట్ట‌డం ఇదే తొలిసారి.
*దీంతో సుప్రీంకోర్టు నియ‌మించిన క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్(సీఓఏ) ప్యాన‌ల్ ప‌ద‌వీకాలం ముగిసింది. 
*ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఎన్‌. గోపాల‌స్వామి చేతుల మీదుగా గంగూలీ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
*గ‌త 33 నెల‌ల నుంచి సీఓఏనే బీసీసీఐ బోర్డును నిర్వహిస్తూ వస్తుంది. 
*బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించారు.. సౌరవ్ గంగూలీ 13 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.
*బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ను 1928 లో ఏర్పాటు చేశారు .


views: 680



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams