Current Affairs Telugu Daily

హైపర్ సోనిక్  క్షిపణి ని తయారు చేయనున్న DRDO

*రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) హైపర్ సోనిక్ క్షిపణి ని తయారు చేస్తుంది. దీనిని త్వరలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. 
*డి ఆర్ డి ఓ క్రిటికల్ మిసైల్ సాంకేతికత,లైఫ్ సైన్సెస్, నావెల్ టెక్నాలజీ వంటి అంశాల మీద  1,500 పేటెంట్ లను పొందింది. 
*డి ఆర్ డి ఓ యొక్క పేటెంట్లను స్టార్ట్ అప్ లు,సూక్ష్మ చిన్న మధ్య స్థాయి  తరహా పరిశ్రమలు వినియోగించుకోవచ్చు. 
*హైపర్ సోనిక్ క్షిపణి - ఇది తర్వాతి తరం ఆయుధ వ్యవస్థ. ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. 
*ఈ క్షిపణిలు సంప్రదాయ మరియు న్యూక్లియర్ పేలోడ్ లను సెకనుకు ఒక మైలు వేగంతో ప్రయోగించగలవు. 
*విండ్ టన్నెల్ ను రూపొందించనున్నారు.  దీని ద్వారా ఆయుధాలను పరీక్షించి, ముందే అవసరమైన మార్పులను చేయవచ్చు. 
*ఇప్పటికే అమెరికా మరియు రష్యా ఈ విధమైన  క్షిపణి వ్యవస్థలను కలిగి ఉన్నాయి.


views: 651



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams