Current Affairs Telugu Daily

బ్రహ్మోస్ ప్రయోగ పరీక్ష విజయవంతం

*భారత వాయుసేన దళం అండమాన్ నికోబార్ దీవుల్లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.భూ ఉపరితలం నుండి ఉపరితలానికి( surface-to-surface) ఉపయోగించే ఈ క్షిపణి  రకాన్ని మొబైల్ ప్లాట్ ఫామ్ నుండి ప్రయోగించారు.
*భారత వైమానిక దళం రెండు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రయోగించింది.
*బ్రహ్మోస్ లక్ష్యం-300 కిలోమీటర్లు 
*ఈ క్షిపణుల ప్రయోగంతో భారత వాయుసేన దళం సామర్థ్యం పెరిగింది. ఈ బ్రహ్మోస్ క్షిపణులు పగలు, రాత్రీ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శత్రువులపైకి ప్రయోగించవచ్చు. 
* రష్యాతోపాటు భారతదేశం కలిసి అభివృద్ధి చేసిన 8.8 మీటర్ల పొడవైన బ్రహ్మోస్ క్షిపణులు 200 నుంచి 300 కిలోల వార్ హెడ్ ను మోయగలవు.
*బ్రహ్మోస్ ఒక తక్కువ పరిధి, ర్యామ్‌జెట్, సూపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణి. నేలపై నుండి, సముద్రంపై నుండి (యుద్ధ నౌకల నుండి), సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుండి), ఆకాశం నుండి (యుద్ధ విమానాల నుండి) ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. భారత దేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యా లోని మోస్క్వా నది - ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడినదే బ్రహ్మోస్. 
*ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా విధ్వంసక క్షిపణు లన్నిటిలో బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది. 
*బ్రహ్మోస్-2 ఒక హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఈ క్షిపణికి 290 కి.మీ. పరిధి వరకు ఉండవచ్చు.  


views: 615



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams