Current Affairs Telugu Daily

యుద్ధభూమిలో పర్యాటకం

ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి కుమార్‌ పోస్ట్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాతిపదికన  తెరిచి ఉంచడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. 
*హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్.. సముద్ర మట్టానికి 11875 నుంచి 18875 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. 
*మైనస్ 18 నుంచి మైనస్ 60 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రాంతంలోకి పర్యాటకులను అనుమతించనున్నారు. 
* మైనస్ ఉష్ణోగ్రతల్లో సైతం మన సైనికులు దేశ రక్షణకు ఎలా పహారా కాస్తున్నారో సామాన్యులకు చూపించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
*ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే యాత్రికులకు కఠిన శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి ఆర్మీ కూడా సాయం అందిస్తుంది. 
*సియాచిన్‌ హిమానీనదీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్‌ రోజుకు రూ.5 నుంచి రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. 3 వేల మంది జవాన్లు ఇక్కడి సరిహద్దులను కాపలా కాస్తుంటారు.
**సముద్రమట్టానికి 21 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌ ఆర్మీ పోస్టుల్లో సాధారణంగా ఒక జవాన్‌ 3 నెలలు మాత్రమే పనిచేస్తారు. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు 28 రోజుల పాటు మంచు గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. మొత్తం 128 కిలోమీటర్ల దూరం నడిస్తే సియాచిన్‌ ఆర్మీ పోస్టులకు చేరుకుంటారు. 
**ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌ ద్వారా 1984లో సియాచిన్‌లో భారత్‌ పాక్‌పై తొలిసారి దాడి చేసింది. 2003లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
*వైద్య పరీక్షల తర్వాతే సియాచిన్‌ యాత్ర ప్రయాణికుల తుది జాబితా సిద్ధమవుతుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు నుబ్రా నది సమీపంలోని మిలటరీ స్కూల్‌లో తగిన శిక్షణ ఇస్తారు.


views: 603



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams