Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టులో త్రిపుల్ తలాక్ చట్టంపై పిటిషన్ 

ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం-2019ను సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే ఈ చట్టాన్ని కేంద్రం మూడు నెలల క్రితం అమల్లోకి తీసుకు వచ్చింది. 
*పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది -  ఎంఆర్ షంషేద్
*చట్ట విరుద్ధంగా విడాకులిచ్చిన ఇతర మతాల వారికి ఒక్క ఏడాది మాత్రమే జైలు శిక్ష ఉండగా.. ట్రిపుల్ తలాక్‌తో విడాకులిచ్చిన ముస్లిం వ్యక్తికి మూడేళ్లు ఎలా శిక్ష విధిస్తారని చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. 
*'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్' లేదా 'తలాక్-ఉల్-బిద్దత్' అనేది 'తలాక్' చెప్పే ఒక విధానం. దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడు సార్లు 'తలాక్', 'తలాక్', 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు.
*ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి.
కొన్ని ముస్లిం మహిళా బృందాలు దీని వల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం ఉండదని వాదిస్తున్నాయి. వివాహ బంధాన్ని కొనసాగించడంలో మహిళలకు కూడా సమానమైన హక్కులు, రక్షణ వ్యవస్థలు ఉండాలని, వివాహ రద్దు విషయంలో తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కేవలం జైలులో పెట్టడం వల్ల లక్ష్యం నెరవేరదు. దీని వల్ల భర్తలు తాము జైలులో ఉండడం వల్ల భరణం చెల్లించలేకపోతున్నామని కూడా చెప్పే అవకాశం ఉంది. అప్పుడు భార్యలే తమను, తమ పిల్లలనూ పోషించుకోవాల్సి వస్తుందని వారు అంటున్నారు.


views: 611



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams