Current Affairs Telugu Daily

రూ.35,000 కోట్లకు రక్షణ రంగ ఎగుమతులు 

*2024 నాటికి భారత రక్షణ రంగ ఎగుమతులను  రూ.35,000 కోట్లకు అంటే మూడు రెట్లు పెంచేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుంది. 
*ఢిల్లీలో జరిగిన దేశీయ రక్షణ పరికరాల  ఎగుమతుల సంఘం నిర్వహించిన ఎక్స్పోలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ ప్రకటన చేశారు. 
*ప్రస్తుత రక్షణ రంగ ఎగుమతుల విలువ  రూ.11,000 కోట్లు.   
*2020 లో రక్షణ రంగ ప్రదర్శన లక్నో లో జరగనుంది. 
*రక్షణ  పరిశ్రమలకు డి ఆర్ డి ఓ మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు సహాయ సహకారాలు అందించనున్నాయి. 
*భారతదేశం  రక్షణ రంగ పరికరాలు అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా మరియు  ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా యుద్ధనౌకలు ,ఫైటర్ జెట్స్ ,శిక్షణ హెలికాప్టర్  లను ఎగుమతి చేస్తుంది. 


views: 608



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams