Current Affairs Telugu Daily

అజర్బైజాన్ లో అలీన దేశాల సదస్సు 

*అక్టోబర్ 25 నుండి 26 మధ్య అలీన దేశాల సదస్సు( NAM) బాకు ,అజర్బైజాన్ లో జరగనుంది. ఇది 18 వ NAM సదస్సు. 
*నేపాల్ ప్రధాని ఓలి ,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా  ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నేపాల్  NAM స్థాపించినప్పటి నుండి ఉన్నసభ్య దేశం. 
*రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు ఏర్పడ్డాయి. ఇవి వర్ధమాన దేశాలపై తమ తమ కూటములలో చేరాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి చెందుతున్న మరియు చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం (Non-Aligned Movement) ఆవిర్భవించింది.
*అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 


views: 605



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams