Current Affairs Telugu Daily

హెచ్‌ఐవీని గుర్తించగానే ఏఆర్‌టీ ప్రారంభం
హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్‌ (హెచ్‌ఐవీ) చికిత్సలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ రోగ నిరోధకతను సూచించే సీడీ4 కణాల సంఖ్య 350 కంటే తక్కువకు పడిపోయినప్పుడే, హెచ్‌ఐవీ బాధితులకు యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్‌టీ)ని అందిస్తున్నారు. ఇకపై హెచ్‌ఐవీని గుర్తించగానే ఏఆర్‌టీని ప్రారంభించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. ఈ సూచనల్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ దీనిపై ఇటీవలే రాష్ట్రాలకు లేఖ రాసింది. తక్షణమే నూతన చికిత్స విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. 
- సీడీ4 కణాల సంఖ్య 350 కంటే తగ్గినప్పుడు రోగ నిరోధక శక్తి బలహీనపడి, ఇన్ఫెక్షన్లు దాడిచేసే ప్రమాదముంటుంది. ఎక్కువమంది క్షయ బారిన పడుతుంటారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక జబ్బులు దాడి చేస్తాయి. ఈ పరిస్థితి రాకుండా ఏఆర్‌టీని అందిస్తారు. 
- రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్న దశలో కంటే, హెచ్‌ఐవీని గుర్తించగానే ఏఆర్‌టీని ప్రారంభించడం వల్ల హెచ్‌ఐవీని పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని, ఎయిడ్స్‌ వరకూ వెళ్లకుండా ముందుగానే అడ్డుకోవచ్చని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.
-ఇక నుంచి నమోదయ్యే ప్రతి కేసునూ ఏఆర్‌టీ పరిధిలో పరిగణిస్తారు. 
- నమోదయ్యే ప్రతి బాధితునికి ప్రభుత్వమే ఉచితంగా ఔషధాలను సరఫరా చేయాల్సి వస్తుంది. వీటిని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (న్యాకో) సరఫరా చేస్తుంది. 

views: 1017



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams