Current Affairs Telugu Daily

ఫిలిప్పైన్స్ లో రాష్ట్రపతి పర్యటన 

*భారత రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ ఫిలిఫైన్స్ మరియు    జపాన్ పర్యటన జరిపారు. 
* రాష్ట్రపతి  ఫిలిప్పైన్స్ రాజధాని  మనీలాలో పర్యటించారు. శాస్త్ర సాంకేతిక రంగం, సంస్కృతి, టూరిజం, సముద్రయాన రంగాలపై వివిధ ఒప్పందాలు జరిగాయి. 
*ఈ ఒప్పందాల్లో వైట్ షిప్పింగ్ డేటా పంచుకునే ఒప్పందం కూడా ఉంది.
*  వైట్ షిప్పింగ్ డేటా షేరింగ్ అగ్రిమెంట్ అనగా వాణిజ్య మరియు మిలిటరీయేతర నౌకల యొక్క కదలిక మరియు గుర్తింపుకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం. వేరే దేశాల నుండి ఏదైనా విపత్తు పొంచి ఉన్నప్పుడు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. 
*నౌకలను  వైట్(వాణిజ్య నౌకల్లో), గ్రే (మిలిటరీ నౌకలు ),బ్లాక్ (అక్రమ నౌకలు) నౌకలు గా వర్గీకరించారు . 
*చైనాతో వివాదం వల్ల ఫిలిఫైన్స్ సముద్రం చాలా నీటి భాగాన్ని కోల్పోయింది.
*భారతదేశం యొక్క యాక్ట్  ఈస్ట్ పాలసీ లో భాగంగా ఏషియన్ దేశాలతో భారతదేశానికి సత్సంబంధాలు అవసరం. 
*ఫిలిప్పైన్స్  భారతదేశం మధ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి,రక్షణ రంగ ఆధునీకరణ, ఫార్మసీ రంగం, నవకల్పన స్టార్ట్ అప్ ల ఏర్పాటు కీలకం కానున్నాయి. 
*భారత్ మరియు ఫిలిపైన్స్ మధ్య సంబంధాల  70వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఫిలిఫైన్స్ పర్యటన చేపట్టారు.
*ఫిలిప్పైన్స్ - ఆగ్నేయాసియాలోని ఒక దేశం. దీని రాజధాని మనీలా. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అక్కడక్కడా ఉన్న 7107 దీవులు ఇందులో భాగం. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. జనాభా సుమారు 9 కోట్లు. ప్రపంచ దేశాల్లో అతిపెద్దవైన ఆర్థిక వ్యవస్థల్లో 46వ స్థానంలో ఉంది. 


views: 768

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams