Current Affairs Telugu Daily

మొదటి బుద్ధిస్ట్ సర్క్యూట్  రైలు

*అక్టోబర్ 20 నుండి 26 వరకు భారత రైల్వే మొట్టమొదటి బుద్ధిస్ట్ సర్క్యూట్  రైలు ను నడపనుంది. 
*ఈ రైలు  భారత్ మరియు నేపాల్ లో గౌతమ బుద్ధుడి కి  సంబంధించిన ప్రాంతాలలో ప్రయాణిస్తుంది. 
* IRCTC ఈ రైలు లుంబిని (బుద్ధుడి జన్మస్థలం )నుండి బౌద్ధ గయ (బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్రాంతం ),సారనాథ్ (మొదటి బోధన), ఖుషి నగర్ (బుద్ధుడు నిర్వాణం )వరకు ప్రయాణిస్తుంది. 
* ఈ యాత్రకు రైలులో అన్ని రకాల సదుపాయాలు కల్పించబడ్డాయి . 
*బుద్ధుడు --20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు.కపిలవస్తు దేశానికీ చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగొళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది.గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాఖ్య వంశస్తులు వ్యవసాయముతోపాటు పరిపాలన చేసేవారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు. 


views: 783

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams