Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల మండలి లో చేరిన వెనుజులా 

*ఐక్యరాజ్య సమితి సాధారణ సభ    వెనిజులా దేశాన్ని 48 వ సభ్యదేశంగా  ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల మండలి లో చేర్చింది. 
*వెనిజులా దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో వుంది. ఆహారం ,మందులు, విద్యుత్ సౌకర్యం కూడా  అందుబాటులో లేవు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఇతర దేశాల నుండి మానవతా సహాయం ఆశిస్తున్నారు .దాదాపు 7 మిలియన్ల వెనిజులా  ప్రజలకు మానవతా సహాయం అవసరమని ఐక్యరాజ్యసమితి హుమానిటేరియన్ అఫైర్స్ ప్రతినిధి అంచనా వేశారు. 
*ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి, 2005 ప్రపంచ సమావేశంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ను భర్తీ చేసేందుకు 2006 సృష్టింపబడింది, ఇందులో మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశోధించే అధికారపత్రం ఉంది.ఈ మానవ హక్కులు మండలి అనేది జనరల్ శాసనసభ యొక్క ఉపసంస్థ మరియు నేరుగా దానికే నివేదిస్తుంది. 
*191 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలలో 47 ఈ మండలిలో సభ్యులుగా ఉన్నాయి.(వెనిజులా కాకుండా)  సభ్యదేశాలు గరిష్ఠంగా ఆరు సంవత్సరాలు ఉండవచ్చు మరియు వారి సభ్యత్వం తీవ్రమైన మానవ హక్కుల దుర్వినియోగాలకు తొలగింపబడవచ్చు. ఈ మండలి జెనీవాలో ఉంటుంది, మరియు సంవత్సరానికి మూడు సార్లు సమావేశమవుతుంది.
*వెనుజులా - అధికారికంగా " బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా మరియు ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ మరియు టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 kమీ2. జీవవైవిధ్యంలో వెనుజులా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఈ దేశములో అపార చమురు నిల్వలు ఉన్నాయి.


views: 691

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams