Current Affairs Telugu Daily

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా అనూప్ కుమార్ సింగ్ 

* నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కొత్త అధిపతిగా అనూప్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.ధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం మేరకు బ్లాక్ క్యాట్స్ కమాండో బలగాల (ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్ జనరల్‌గా ఈయనను నియమించారు. 
*పదవీ  కాలం - సెప్టెంబర్ 20,2020 వరకు
**ఎన్ఎస్‌జీ ని తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కొరకు  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు. దీనిని 1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య తర్వాత తీవ్రవాద చర్యలను అరికట్టేందుకు మరియు రాష్ట్రాల్లో అంతర్గత కల్లోలాలను  ఎదుర్కోవడానికి ఏర్పాటు చేశారు. 
*ఈ దళం సాయుధ బలగాల వర్గీకరణలో కాకుండా, ప్రత్యేక విభాగం కింద పని చేస్తుంది. ఈ దళంలో పనిచేసేవారిని  సాధారణంగా బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తారు. 
*క్యాబినెట్ నియామక కమిటీ -కేంద్ర ప్రభుత్వ కింద ఉండే  అత్యున్నత నియామకాలు చేపడుతుంది . దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటారు.ఈ కమిటీ లో కేంద్ర హోంమంత్రి ఉంటారు. 


views: 663

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams