Current Affairs Telugu Daily

ఇండియన్‌ బ్యాంక్స్ అసోసియేషన్‌ నూతన చైర్మన్ 

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు.2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు.
*డిప్యూటీ చైర్మన్లు(3)--1.యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన జి రాజ్‌కిరణ్‌ రాయ్‌ 
2. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన ఎస్‌ఎస్‌ మల్లికార్జున రావు
3.జేపీ మోర్గాన్‌ చేజ్‌ బ్యాంకుకు చెందిన మాధవ్‌ కళ్యాణ్‌ ఎన్నికయ్యారు.
*గౌరవ కార్యదర్శి -  ఐడీబీఐ బ్యాంకు ఎండీ రాకేశ్‌ శర్మ  
*ఇండియన్‌ బ్యాంక్స్ అసోసియేషన్‌ (IBA)ని సెప్టెంబర్ 26,1946 లో స్థాపించారు.వివిధ బ్యాంకుల నిర్వహణ, ఆపరేషన్ లకు  ప్రాతినిధ్య సంస్థగా ముంబై లో ఏర్పాటు చేశారు. 
*1946 లో 22 బ్యాంకులు ఉండగా,ప్రస్తుతం 237 బ్యాంకులు  IBA కింద ఉన్నాయి. బ్యాంకుల మధ్య సహకారం, బ్యాంకుల అభివృద్ధి ,బ్యాంకులను బలోపేతం చేయడానికి ఈ సంస్థను స్థాపించారు.  
*ఈ సమస్య నిర్వాహణకు మేనేజింగ్ కమిటీ ఉంటుంది. ఈ మేనేజింగ్ కమిటీ లో ఒక చైర్మన్ , ముగ్గురు  డిప్యూటీ చైర్మన్లు,ఒక గౌరవ కార్యదర్శి,26 మంది సభ్యులు ఉంటారు.


views: 629

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams