Current Affairs Telugu Daily

భారత్-అమెరికాల మధ్య $18 బిలియన్ల రక్షణ వాణిజ్యం 

భారత్‌-అమెరికా ద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం ఈ ఏడాది చివరి నాటికి 18బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్‌ ప్రకటించింది.2008 లోద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం  భారత్ అమెరికాల మధ్య దాదాపు శూన్యం. 
*త్వరలో భారత్‌-అమెరికా రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య కార్యక్రమం'(డీటీటీఐ) తొమ్మిదో సమావేశం దిల్లీలో  జరగనుంది. 
*ఆగస్టులో భారత్-అమెరికా మధ్య జరిగిన 'డిఫెన్స్‌ పాలసీ గ్రూప్' సమావేశం తరవాత భారత్‌కు స్ట్రాటజిక్ ట్రేడ్‌ అథారిటీ టైర్‌-1 హోదాను అమెరికా కల్పించింది.  దీని వల్ల క్రమబద్ధీకరించిన ప్రక్రియ ద్వారా అమెరికాకు చెందిన కంపెనీలు ద్వంద్వ వినియోగ(ద్వంద్వ వినియోగం అనగా పౌరుల అవసరాలకు అంటే శాంతి స్థాపనకు మరియు మిలిటరీ అవసరాలకు ఉపయోగపడే సాంకేతిక ఉత్పత్తులు) అధునాతన పరికరాలను భారత్‌కు అందించే అవకాశం ఉంటుంది. 
*దీనివల్ల నాటో గ్రూప్‌లోని జపాన్‌, సౌత్‌ కొరియా, ఆస్ట్రేలియాతో సమానంగా భారత్‌కు హోదా కల్పించారు. 
* గత జూన్‌లో భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా నాటో గ్రూప్‌లోని సౌత్‌ కొరియా, ఇజ్రాయెల్‌తో సమాన హోదా కల్పించే ప్రొవిజన్ ఆమోదించబడింది.


views: 612

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams