Event-Date: | 19-Oct-2019 |
Level: | International |
Topic: | Foreign relations |
పాకిస్తాన్ కు వార్నింగ్ ,4 నెలల సమయం
*ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)కిస్తాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది.ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు, ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే విషయంలో పాకిస్తాన్ తీరు మారకపోతే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించింది.
*ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భాగంగా ఉగ్రమూకలకు ఆర్థిక తోడ్పాటును అందించడం ఆపడానికి నాలుగునెలల సమయాన్నిచ్చింది.ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడంలో పాకిస్థాన్ విఫలమవ్వడంతో ఎఫ్ఏటీఎఫ్ 2018లో గ్రేలిస్ట్‌లో చేర్చింది.
*2020 ఫిబ్రవరి నాటికి 27 అంశాలతో కూడిన ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తారు.అందులో కేవలం ఐదింటిలో మాత్రమే పాక్ పనితీరు సంతృప్తికరంగా ఉంది.
* ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ
*ఈ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యాలను పాటించని దేశాలను గ్రే జాబితాలో చేర్చుతారు.
*ఈ జాబితాలో ఉండడంవల్ల పాకిస్తాన్ తీవ్రమైన పరిశీలనను( scrutiny) ఎదుర్కోవలసి ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుంది.
*ఈ జాబితాలో ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ డబ్బు తీవ్రవాదులకు చేరే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తారు. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది.
* FATF లో బ్లాక్ లిస్ట్ మరియు గ్రే లిస్ట్ రెండు ఉంటాయి.తీవ్రవాదానికి డబ్బు సరఫరా చేసే మరియు హవాలా కార్యక్రమాలను చేపట్టే దేశాలను బ్లాక్ లిస్ట్ లో ఉంచుతారు.బ్లాక్ లిస్ట్ కంటే తక్కువ తీవ్రత గల కార్యక్రమాలను చేపట్టే దేశాలను గ్రే లిస్టు లో ఉంచుతారు. ఇది ఒక హెచ్చరిక వంటిది.
*2012 నుండి 2015 వరకు పాకిస్తాన్ గ్రే లిస్టులో ఉంది.2018 జూన్ లో తిరిగి రెండోసారి గ్రే లిస్టులో పాకిస్తాన్ చేరింది.
*FATF సంస్థ ను 1989 లో ప్రారంభించారు .G7 పారిస్ సదస్సులో భాగంగా మనీలాండరింగ్(హవాలా ),తీవ్రవాదానికి నిధులు సమకూరకుండా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశారు.దీని ప్రధాన కార్యాలయం పారిస్ లో ఉంది.
* మొత్తం సభ్య దేశాల సంఖ్య 39. భారతదేశం ఇందులో సభ్యదేశంగా ఉంది.