Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి

*సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు.
*ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్నారు.  సీనియారిటీలో జస్టిస్‌ రంజన్‌ తర్వాత ఎస్‌ఏ బాబ్డే ఉన్నారు.
*సాంప్రదాయం ప్రకారం తన తదుపరి వారసుడిని ప్రస్తుత సీజేఐ ప్రతిపాదించాలి. తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు జస్టిస్‌ రంజన్‌  లేఖ రాశారు.
* నవంబరు 18న జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
*సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్‌ అరవింద్‌ బోబ్డే బాధ్యతలు చేపడతారు.
*శరద్‌ అరవింద్‌ బోబ్డే -  1956 ఏప్రిల్‌24న మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన న్యాయవాద కుటుంబంలో బోబ్డే జన్మించారు. నాగ్‌పూర్‌ యూనివర్సిటీకి చెందిన ఎస్‌ఎఫ్‌ఎస్‌ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు.  2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
*ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు. 


views: 717Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams