Current Affairs Telugu Daily

వ్యవసాయ వ్యర్థాలతో బయో ఇటుకలు

*వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు బయో ఇటుకలు తయారు చేశారు.ఇవి పర్యావరణహితంగా, తక్కువ ఖర్చులో ఉంటాయి. 
*పరిశోధకులు -ఐఐటీ హైదరాబాద్‌ డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ పీహెచ్‌డీ స్కాలర్‌ ఆర్‌.ప్రియాబ్రతా రౌత్రే, కేఐఐటీ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ భువనేశ్వర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.అవిక్‌రాయ్‌ బృందం బయో ఇటుకల తయారీపై పరిశోధనలు చేసింది. 
*మట్టితో తయారుచేసే ఇటుకలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.  భారత్‌లో ఏటా 500 మిలియన్‌ టన్నులకు పైగా వ్యవసాయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.84 నుంచి 141 మిలియన్‌ టన్ను లు బుడిద ఈ వ్యర్థాల ద్వారా ఏర్పడుతుంది. 
*బయో ఇటుకలు మట్టి ఇటుకల కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. చెక్క లేదా లోహ నిర్మాణాల్లో వాడితే తక్కువ ఖర్చుతో గృహాలు నిర్మించుకోవచ్చు. 
*వరి వ్యర్థాలు, గోధుమ వ్యర్థాలు (గడ్డి తదితరాలు), చెరుకు పిప్పి, కాటన్‌ ప్లాంట్‌ వంటి పొడి వ్యర్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. చెరుకు భాగస్సే (పిప్పి), సున్నం ఆధారిత ముద్ద తయారు చేయడం ఇటుక తయారీలో తొలి ప్రక్రియ. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, ఒకట్రెండు రోజులు ఆరబెట్టి, ఆ తర్వాత ఇటుకలను 15 నుంచి 20 రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని వినియోగించడానికి నెల రోజులు పడుతుంది. 


views: 695

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams