Current Affairs Telugu Daily

 2020 వరకు గ్రే జాబితాలోనే పాకిస్తాన్ 

పాకిస్తాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)  యొక్క గ్రే జాబితాలోనే(Grey List)2020 వరకు ఉంచేందుకు  FATF నిర్ణయించింది.ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, మనీ లాండరింగ్ వంటి అంశాలపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందిగా FATF సూచించింది. 
*ఈ గ్రే జాబితాలో తీవ్రవాదానికి నిధులు సమకూర్చే దేశాలను చేర్చుతారు. ఇటీవల  ప్యారిస్ లో జరిగిన FATF సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
*ఈ జాబితా నుండి తమ దేశ పేరును తొలగించాలని పాకిస్తాన్ మంత్రులు ఈ సదస్సులో కోరారు. 
*ముందుగా  పాకిస్తాన్ ను ఈ జాబితాలో 2012 నుండి 2015 మధ్యకాలానికి చేర్చారు.చైనా,టర్కీ, సౌదీ అరేబియా,ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పాకిస్తాన్ ను ఈ జాబితా నుండి తొలగించాలని ఓటు వేశాయి. 
*ఈ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యాలను పాటించని దేశాలను  గ్రే జాబితాలో  చేర్చుతారు.  
*ఈ జాబితాలో ఉండడంవల్ల  పాకిస్తాన్ తీవ్రమైన పరిశీలనను( scrutiny)  ఎదుర్కోవలసి ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠకు  భంగం వాటిల్లుతుంది. 
*ఈ జాబితాలో ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ డబ్బు  తీవ్రవాదులకు చేరే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తారు. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. 
*అంతర్జాతీయ రుణాలు పొందడం కష్టతరం అవుతుంది.దేశ current account deficit పై ప్రభావం చూపుతుంది.
*పాకిస్తాన్ యొక్క ఎగుమతులు అయిన బియ్యం, పత్తి ,మార్బుల్, ఉల్లిపాయలపై ప్రభావం ఉంటుంది.
*FATF సంస్థ ను 1989 లో ప్రారంభించారు .G7 పారిస్  సదస్సులో భాగంగా మనీలాండరింగ్(హవాలా ),తీవ్రవాదానికి నిధులు సమకూరకుండా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశారు.దీని ప్రధాన కార్యాలయం పారిస్ లో ఉంది. 
* మొత్తం సభ్య దేశాల సంఖ్య 39.  భారతదేశం ఇందులో సభ్యదేశంగా ఉంది. 


views: 649

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams