Current Affairs Telugu Daily

ఫుడ్ సేఫ్టీ మిత్ర పథకం 

*ఆరోగ్య మిత్ర తరహాలోనే ఆహార భద్రత మిత్ర(ఫుడ్‌ సేఫిటీ మిత్ర)లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది . ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ బుధవారం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
*రోడ్ల పక్కన అంగళ్లలో ఆహార పదార్థాలు విక్రయించేవారు పరిశుభ్రత పాటించేలా ఆహార భద్రత మిత్రలు పర్యవేక్షిస్తాయి.  ఆహార భద్రత మిత్రలకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ(భారత ఆహార భద్రత-ప్రమాణిక సంస్థ) శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తుంది. 
*ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా, లైసెన్సులు పొందడం, రిజిస్ర్టేషన్‌ తదితర విషయాల్లోనూ ఇవి సహాయపడతాయి.
* ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద అత్యవసర కేసులు, సమస్యల పరిష్కారం, గుర్తింపు, లబ్ధిదారుల పరిశీలన వంటి అంశాల్లో వీరు పనిచేస్తారు.
*కేంద్ర ప్రభుత్వం  ఫుడ్ సేఫ్టీ మిత్ర (Food Safety Mitra)పథకాన్ని ఈట్ రైట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర ఆరోగ్య మరియు  కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు.
*ఈట్ రైట్ జాకెట్ ,ఈట్ రైట్ జోల కార్యక్రమాలను  ఫిట్ ఇండియా ఉద్యమం లో భాగంగా ప్రారంభించారు. 
* ఫుడ్ సేఫ్టీ మిత్ర - చిన్న మరియు మధ్య తరగతి  ఆహార పదార్ధాల వ్యాపారం చేసే వారు ఫుడ్ సేఫ్టీ చట్టాలను పాటించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.*ఆహార  మరియు న్యూట్రిషన్ రంగంలో విద్యను అభ్యసించిన యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం ఈ పథకం ఉపయోగపడుతుంది. 
థీమ్ --Healthy Diets for a Zero Hunger World
*ఈట్ రైట్ జాకెట్- వీరు ‘ఈట్‌ రైట్‌ కోటు’ ధరించి విధులు నిర్వహిస్తారు. ఈ జాకెట్ ను  స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ తీసుకెళ్లడానికి అనుగుణంగా తయారు చేశారు. క్యూఆర్ కోడ్,రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్  ట్యాగ్ కలిగి ఉండడం వల్ల ట్రాకింగ్ చేయవచ్చు. దీనిని ఫీల్డ్ లో పనిచేసే అధికారులను ట్రాక్ చేయడానికి, ఆహార పర్యవేక్షణ లో పారదర్శక  పెంచడానికి రూపొందించారు. ఆహారభద్రతలో పారదర్శకత, నైపుణ్యం తీసుకురావడంతోపాటు కిందిస్థాయి సిబ్బందికి విధుల్లో భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
 *ఇట్ రైట్ జోల --తిరిగి వినియోగించే కలిగే  క్లాత్ బ్యాగ్ ను రూపొందించారు . 
*ఇంటి సరుకులు తీసుకురావడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ఈ క్లాత్ బ్యాగ్ ను తయారు చేశారు. 


views: 652

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams