Current Affairs Telugu Daily

అయోధ్య కేసులో రిజర్వులో తీర్పు

*రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీ మ‌సీదు కేసులో తీర్పును సుప్రీం రిజ‌ర్వ్‌లో ఉంచింది. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమై 38 రోజులకుపైగా కొనసాగిన విచారణ ముగిసింది. 
* ముస్లిం పార్టీల్లో, ఇటు హిందూ పార్టీల్లో పరస్పర విరుద్ధ వైఖరులు కూడా ఉన్నాయి.
*‘నిర్మోహి అఖారా’ సంస్థ డిమాండ్‌ ---అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి 16వ శతాబ్దంలో బాబర్‌ మసీదు నిర్మించారు , ఆ స్థలంలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతించాలి .తరతరాలుగా రాముడిని పూజించే హక్కు తమకే ఉందని, తామే నిజమైన ఆరాధకులమని, తమకే రామ జన్మభూమి స్థలం దక్కాలని డిమాండ్ చేస్తుంది.  
*రామ్‌ లల్లా’, ‘రామ్‌ జన్మస్థాన్‌’ సంస్థల డిమాండ్‌ -- వివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలి. అక్కడ రామ మందిరాన్నినిర్మించుకుంటాం  అని డిమాండ్. రామ్‌ లల్లాలో ఎక్కువ మంది విశ్వహిందూ పరిషద్‌ సభ్యులు ఉండగా, రామ్‌ జన్మస్థాన్‌లో ఎక్కువగా ఆరెస్సెస్‌ సభ్యులు ఉన్నారు.
*నిర్మోహి అఖారా రామ్‌ లల్లా, రామ్‌ జన్మస్థాన్‌ సంఘాలతో తీవ్రంగా విభేదిస్తోంది.
*విశ్వ హిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి న్యాస్‌’తో హిందూ మహాసభ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. 
* షియా ముస్లిం వర్గానికి ‘అఖిల భారత షియా కాన్ఫరెన్స్‌’, ‘షియా వక్ఫ్‌ బోర్డ్‌’ ప్రాతినిథ్యం వహిస్తున్నండగా, సున్నీ ముస్లింలకు ‘సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌’ ప్రాతినిధ్యం వహిస్తోంది.యోధ్య వివాదంలో మొదటి నుంచి ఉన్న ప్రధాన పార్టీ సున్నీ వక్ష్‌ బోర్డు. 
* షియా వక్ఫ్‌ బోర్డు - బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, షియా మసీదని డిమాండ్ చేస్తుంది.  షియా వక్ఫ్‌ బోర్డు న వైఖరిని మార్చుకుంది. దేశ సామరస్య, సమగ్రతలను పరిరక్షించడం కోసం హిందూ పార్టీలకు స్థలాన్ని అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
*1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన ప్రాంతంలోని 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేసి నిర్మోహి అఖారా, హిందూ సంస్థలు, సున్నీ వక్ష్‌ బోర్డుకు పంచాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు సుప్రీం కోర్టులో సవాల్‌ చేసాయి. 


views: 669

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams