Current Affairs Telugu Daily

ఆఫ్ఘనిస్తాన్ కు Mi-24V  హెలికాప్టర్లు 

*భారత అంబాసిడర్ H.E.వినయ్ కుమార్  ఆఫ్ఘనిస్తాన్ రక్షణ  శాఖ మంత్రి ద్వారా ఆఫ్ఘనిస్తాన్  వాయుసేనకు రెండు Mi-24V హెలికాప్టర్లను  అందించింది. 
*ఈ హెలికాప్టర్లు ఆఫ్గనిస్థాన్ దేశంలో శాంతి నెలకొల్పడానికి  ఉపయోగపడతాయి. 2015-16 మధ్యకాలంలో భారత్ ఆఫ్గనిస్తాన్ కు ఇచ్చిన  4 హెలికాప్టర్ల స్థానంలో ఈ రెండు కొత్త Mi-24V హెలికాప్టర్లను భారత్ అందించింది. 
*ఆఫ్ఘనిస్థాన్ లో శాంతి స్థాపనకు భారత్ సహకారం అందిస్తూ వస్తుంది.ఆప్ఘనిస్థాన్ లో సరిహద్దు తీవ్రవాదం,అంతర్గత కలహాలు  ఎక్కువగా ఉన్నాయి.   
*ఆఫ్ఘనిస్తాన్ లేదా అఫ్ఘనిస్తాన్ (Afġānistān) దక్షిణ మధ్య ఆసియాలోని, సముద్రతీరం లేని దేశం. ఈ దేశం ఆధికారిక నామం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో మధ్య ఆసియా దేశంగాను, మధ్యప్రాచ్య దేశంగాను, లేదా దక్షిణ ఆసియా దేశంగాను వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. దక్షిణాన, తూర్పున పాకిస్తాన్,పశ్చిమంలో ఇరాన్, ఉత్తర దిశలో తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, సుదూర ఈశాన్యంలో కొద్దిభాగం చైనా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి.


views: 607

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams