Current Affairs Telugu Daily

భారత వృద్ధిరేటు అంచనాకు ఐఎంఎఫ్ కోత

*అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనా ను తగ్గించింది. జూలైలో 7 శాతం అంచనా వేసిన సంస్థ 2019 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.1 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. 
* ఐఎంఎఫ్ ప్రకారం ,దేశీయ డిమాండ్‌ ఊహించిన దానికంటే బలహీనంగా ఉంది. 
*7.2 శాతంగా ఉన్న అంచనాను 20 బిపిఎస్‌ పాయింట్లు  తగ్గించి,7 % గా 2020 సంవత్సరానికి అంచనా వేసింది. 
*భారత్ కు  అనుకూలతలు -- ద్రవ్య విధాన సడలింపు, ఇటీవలి కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపులు,గ్రామీణ వినియోగానికి తోడ్పడే ప్రభుత్వ కార్యక్రమాలు వృద్ధికి సహాయపడతాయి.  
*భారత్‌ పొరుగు దేశమైన చైనా వృద్ధిని 6.1 శాతంగా అంచనా వేసింది.వచ్చే ఏడాది 5.8 శాతానికి తగ్గనుంది. ప్రపంచంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశంగా భారత్‌ ఉండనుంది.
*మహిళలు, పురుషుల మధ్య చెల్లించని పనిలో లింగ అసమతుల్యత ఇంచుమించు అన్ని దేశాల్లో అత్యధికంగా ఉన్నాయి.పురుషుల కంటే మహిళలు రెండు గంటలు అధికంగా పనిచేస్తున్నారు.
*ప్రపంచ వృద్ధిరేటు- 3%,2017లో వృద్ధి 3.7 శాతంగా ఉన్నది. 
* 2020లో కాస్త పెరిగి 3.4 శాతానికి చేరవచ్చని అంచనా. 


views: 625

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams