Current Affairs Telugu Daily

వేర్‌హౌసింగ్‌కు డిమాండ్‌ -  రూ.3,550 కోట్ల పెట్టుబడులు 

*ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కంపెనీ సీబీఆర్‌ఈ నివేదిక --- జీఎ్‌సటీ ప్రవేశపెట్టిన తర్వాత వేర్‌హౌసింగ్‌కు డిమాండ్‌ పెరగడంతో 2017 నుంచి ఆ రంగంలోకి 50 కోట్ల డాలర్ల (రూ.3,550 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి.వేర్‌హౌసింగ్‌లో నాణ్యమైన ప్రదేశాలకు డిమాండ్‌ పెరిగింది.  
*లాజిస్టిక్స్‌ విభాగానికి మౌలిక వసతుల హోదా ఇవ్వడం అనుకూలంగా మారింది. ఈ నివేదిక ప్రకారం  పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ విభాగాల నుంచి డిమాండ్‌ అధికంగా ఉంది. 
* గత ఏడాదితో పోల్చితే వేర్‌హౌసింగ్‌ డిమాండ్‌ 10 నుంచి 15 శాతం పెరిగి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రదేశాలకు డిమాండు ఏర్పడవచ్చని అంచనా వేసింది.
* నిర్వహణా విధానాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడం, సరికొత్త వ్యాపార వ్యూహాలు అనుసరించడం, సరఫరా వ్యవస్థ సామర్థ్యాలు మెరుగుపడడం, వేర్‌హౌసింగ్‌ డిమాండ్‌ పెరగడం, వివిధ మార్గాల ద్వారా నిధుల అందుబాటు వల్ల వేర్‌హౌసింగ్‌ రంగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించింది. 
* ఇ- వే బిల్లింగ్‌ రావడం వల్ల కార్గో, స్టోరేజీ, రవాణా విధానాల్లో పలు లోపాలు తొలగిపోయి వ్యాపారానుకూలత మెరుగుపడింది.
*2030 నాటికి దేశంలో వేర్‌హౌసింగ్‌ ప్రదేశాల సరఫరా 50 కోట్ల చదరపు అడుగులకు పెరిగే ఆస్కారం ఉంది.
*ద్వితీయ శ్రేణి నగరాల్లో లాజిస్టిక్స్‌ షిప్‌మెంట్ల వాటా 2017లో 40 శాతం ఉండగా 2022 నాటికి 50 శాతానికి పెరగవచ్చు.
*భారీ పంపిణీ కేంద్రాలు విస్తరించడం, ఆర్డర్‌ ఇచ్చిన రోజునే డెలివరీకి డిమాండ్‌ పెరగడంతో సరఫరా వ్యవస్థలో చివరి ప్రదేశంలో వేర్‌హౌ్‌సలకు డిమాండ్‌ పెరుగుతుంది.


views: 600

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams