Current Affairs Telugu Daily

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ స్థానం

*  ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ ఇంకా దిగువస్థాయి ర్యాంక్ లోనే ఉంది.117 దేశాలకు గాను భారత్‌ 102వ స్ధానంలో చిట్టచివరి దేశాల పక్కన నిలిచింది. 
*ఆకలితో అలమటిస్తున్న  45 దేశాల్లో భారత్ కూడా ఉంది. 
* దక్షిణాసియాలో పాకిస్తాన్‌ (94), బంగ్లాదేశ్‌ (88), శ్రీలంక (66)ల కన్నా భారత్‌ వెనుకబడింది.
*2014లో ఆకలి సూచీలో 77 దేశాల్లో భారత్‌ 55వ స్దానంలో నిలిచింది. 2015 లో 93 వ స్థానంలో ఉంది . 
*చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భారత్‌తో పోలిస్తే దక్షిణాసియాలో నేపాల్‌, బంగ్లాదేశ్‌లు మెరుగ్గా ఉన్నాయి. 
*ఈ సూచీని  అంతర్జాతీయ ఆహార విధాన  పరిశోధనా సంస్థ( International Food Policy Research Institute -IFPRI),వెల్త్‌హంగర్‌లైఫ్‌ అండ్‌ కన్సన్‌ వర్డ్ల్‌వైడ్‌ సంస్థ  సంయుక్తంగా విడుదల చేస్తారు. 
*దేశంలో ఆరు నుంచి 23 నెలల చిన్నారుల్లో కేవలం 9.6 శాతం మందికే సరైన మోతాదులో ఆహారం అందుతుంది. 
*2015-16లో 90 శాతం గృహాలకు మెరుగైన తాగు నీరు లభించినా, 39 శాతం మంది గృహస్తులకు పారిశుద్ధ్య సదుపాయాలు అందలేదు.
*ఈ  సూచీలో 100 నుండి సున్నా వరకు  పాయింట్లు అందిస్తారు.సున్నా పాయింట్లు ఉన్న దేశం  ఆకలి లేని దేశంగా గుర్తించబడుతుంది,100 పాయింట్లు గల దేశం అత్యంత ఆకలి ఉన్న దేశం గా గుర్తించబడుతుంది. ఈ సూచీలో భారత స్కోర్ 30. 3  పాయింట్లు అనగా(20-34. 9 మధ్య ఉంటె ) తీవ్ర ఆకలి ఉన్న దేశంగా గుర్తించబడింది. 
* పర్యావరణ మార్పుల వల్ల కూడా ఆకలి ప్రభావం ఎక్కువ ఉండవచ్చు అని ఈ నివేదిక తెలిపింది. 


views: 676

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams