Current Affairs Telugu Daily

 బీపీసీఎల్‌  కంపెనీ ప్రైవేటీకరణ; జీఎస్టీ పరిధిలోకి విమాన ఇంధనం,సహజ వాయువు

*  దేశ చమురు శుద్ధి, పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో మార్కులకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది .ఇప్పటి వరకు ఈ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలకు దాదాపుగా గుత్తాధిపత్యం ఉంది.
*బీపీసీఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వానికి 53.29 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం చూస్తే బీపీసీఎల్‌ కంపెనీ షేర్ల మొత్తం మార్కెట్‌ విలువ దాదాపు రూ.1.05 లక్షల కోట్లు. 
* ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం కింద నిర్ణయించిన రూ.1.05 లక్షల కోట్లు కాగా, బీపీసీఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వ వాటా అమ్మేస్తే ప్రభుత్వానికి  రూ.55,000 వరకు సమకూరుతాయి.
*విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజ వాయువుల్ని జీఎ్‌సటీ పరిధిలోకి తేవాలని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సయిజ్‌ టాక్స్‌, రాష్ట్రాలు విధించే విలువ జోడింపు పన్ను(వ్యాట్‌)తో విమాన ఇంధనం,సహజ వాయువు ఉత్పత్తులపై పన్నుల భారం ఎక్కువగా ఉంది.
*విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో దాదాపు సగం ఏటీఎ్‌ఫకే ఖర్చవుతుంది. 
*ఈ రెండు పెట్రో ఉత్పత్తులను జీఎ్‌సటీ పరిధిలోకి తెస్తే, వీటిపై చేసే ఖర్చులకు కంపెనీలకు ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) లభిస్తుంది.


views: 695

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams