Current Affairs Telugu Daily

టర్కీ పై అమెరికా ఆంక్షలు 

*ఉత్తర సిరియాలో  మిలిటరీ చర్యలకు వ్యతిరేకంగా  అమెరికా టర్కీ దేశం పై ఆంక్షలు విధించింది. 
* ముఖ్యంగా   టర్కీ రక్షణ మరియు    శక్తి వనరుల మంత్రిత్వశాఖ పై ఆంక్షలు విధించింది. 
* అమెరికాతో  ఆర్థిక బదలాయింపు లను  నిషేధిస్తుంది. ఇటీవల టర్కీ     దళాలు సిరియా సరిహద్దుల్లో ని  కుర్దు లపైన  దాడులు చేపట్టింది. 
*ఈ ఆంక్షల్లో  భాగంగా అమెరికా స్టీల్ పై సుంకాలను పెంచడం,$ 100 బిలియన్ల వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది.
*టర్కీ అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్‌బైజాన్, మరియు ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్ మరియు సిరియాలు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము మరియు సైప్రస్, ఏగియన్ సముద్రము మరియు ద్వీపసమూహములు పశ్చిమాన మరియు ఉత్తరాన నల్ల సముద్రము గలవు.


views: 627

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams