Current Affairs Telugu Daily

భారత్‌తో అమెరికా మరింత రక్షణ బంధం..
పాక్‌కు భద్రతా సాయంపై షరతులు 
2017 అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2018 ఆర్థిక సంవత్సరం కోసం అమెరికా రక్షణ బడ్జెట్‌ను 62100 కోట్ల డాలర్లుగా ఖరారు చేస్తూ అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఇందులో భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి కూడా తీర్మానించుకుంది. జాతీయ రక్షణ అధీకరణ చట్టం-2018 సభ 344-81 ఓట్ల మెజార్టీతో ఆమోదం తెలిపింది. సెనేట్‌, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోద ముద్ర పడ్డాక ఇది చట్ట రూపం దాలుస్తుంది. 2016 రక్షణ బడ్జెట్‌ సందర్భంగా భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించింది. దీని ప్రకారం రక్షణ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విషయంలో తనకు అత్యంత సన్నిహిత మిత్రపక్షాలతో సమానంగా భారత్‌ను పరిగణిస్తుంది.
పాకిస్థాన్‌కు రక్షణ సాయంపై షరతు 
అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వచ్చే రక్షణ నిధుపై కఠినమైన నిబంధనలు తీసుకొచ్చే విధంగా అమెరికా చట్టసభ మూడు శాసన సవరణలను తీసుకొచ్చింది. ఉగ్రవాదంపై ఇస్లామాబాద్‌ చేస్తున్న పోరు సంతృప్తికరంగా ఉంటేనే నిధులను మంజూరు చేసే విధంగా చేయాలని ఈ సవరణల్లో పేర్కొంది. జాతీయ భద్రతా అధికార చట్టం-2018 కింద 3 శాసన సవరణలను అమెరికా కాంగ్రెస్‌ సభ్యు ఆమోదం తెలిపారు. 

views: 987



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams