Current Affairs Telugu Daily

భారత్ బంగ్లాదేశ్ మధ్య సముద్ర విన్యాసాలు 

భారత్ నేవి(IN) మరియు బంగ్లాదేశ్ నేవి(BN)  మధ్య  జరిగే మొట్టమొదటి ద్వైపాక్షిక  సముద్ర విన్యాసాలు అక్టోబర్ 12 నుండి  16వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. 
* IN-BN విన్యాసాల ద్వారా  భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య  పరస్పర సంబంధాలు బలోపేతం అవుతాయి. 
*ఈ సైనిక విన్యాసానికి ముందు IN-BN  నౌకలు కోఆర్డినేటెడ్ పట్రోల్ విన్యాసం  (CORPAT) నిర్వహించాయి.
*బంగ్లాదేశ్ పొరుగున ఉన్న భారతదేశంతో అత్యధికంగా అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. బంగ్లాదేశ్ భారతదేశ సంబంధాలు చారిత్రక మరియు సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నాయి. ఇవి 1971 స్వాతంత్ర్య సమరంలో బంగ్లాదేశ్‌కు భారత్ అందించిన సహాయం ఇరుదేశాల సంబంధాలను మరింతగా బలపరిచింది. భారత్‌ వ్యాపారభాస్వామ్యంలో దక్షిణాసియా దేశాలలో బంగ్లాదేశ్ ముఖ్యమైనది. భారత్‌తో వ్యాపార సంబంధాలలో బంగ్లాదేశ్ 5 వ స్థానంలో ఉంది అయినప్పటికీ సరిహద్దు వివాదాలు, వ్యాపార సంబంధాలు, వ్యాపార సరిహద్దులు మరియు 54 నదులతో జలాలను పంచుకోవడంలో వివాదాలు సంబంధాలను కొంత బాధిస్తున్నాయి. ఇటీవలి కాలంలో తీవ్రవాదంతో పోరాడడానికి రెండు దేశాలు సమైక్యంగా ప్రయత్నిస్తున్నాయి.


views: 680

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams