Current Affairs Telugu Daily

పఠాన్‌కోట్‌లో జాతీయ భద్రతా దళ కేంద్రం

* దేశ భద్రతకు అత్యంత కీలకమైన పఠాన్‌కోట్‌లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు వేగంగా నిర్వహించేందుకు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
*పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఎన్ఎస్‌జీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
*ఎన్ఎస్‌జీలోని స్పెషల్ యాక్షన్ గ్రూప్ (ఎస్ఏజీ) కమాండోలను ఇక్కడ నియమిస్తారు. దాదాపు 500 మంది కమాండోలు నిరంతరం సర్వసన్నద్ధంగా ఉంటారు.
*పఠాన్‌కోట్‌లో భారత వాయు సేన (ఐఏఎఫ్) ప్రధాన స్థావరం ఉంది.
*ఎన్ఎస్‌జీ ని తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కొరకు  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు. దీనిని 1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య తర్వాత తీవ్రవాద చర్యలను అరికట్టేందుకు మరియు రాష్ట్రాల్లో అంతర్గత కల్లోలాలను  ఎదుర్కోవడానికి ఏర్పాటు చేశారు. 
*ఈ దళం సాయుధ బలగాల వర్గీకరణలో కాకుండా, ప్రత్యేక విభాగం కింద పని చేస్తుంది. ఈ దళంలో పనిచేసేవారిని  సాధారణంగా బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తారు. 


views: 647

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams