Current Affairs Telugu Daily

పారిశ్రామికవేత్తలు - దాతృత్వం

*దాతృత్వం విషయంలో దేశంలోని పారిశ్రామికవేత్తల్లో హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శివ్‌ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు.తర్వాతి స్థానంలో విప్రో వ్యవస్థాపక చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ఉన్నారు.
*దేశంలోని సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ,దాతృత్వం విషయంలో మూడో స్థానంలో నిలిచారు.
*జాబితా విడుదల చేసినది --  ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌, హురున్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లు ‘ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ జాబితా’ను విడుదల చేసింది. 
* 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకు విరాళంగా ఇచ్చిన మొత్తాన్ని ఆధారంగా చేసుకున్నారు.అగ్రస్థానంలో ఉన్న నాడార్‌, ఆయన కుటుంబం రూ.826 కోట్లు విరాళంగా ఇచ్చింది. ప్రేమ్‌జీ రూ.453 కోట్లు, అంబానీ రూ.402 కోట్లు విరాళంగా ఇచ్చారు. 
*నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని (రూ.204 కోట్లు), ఐదో స్థానంలో అజయ్‌ పిరామల్‌, ఆయన కుటుంబం (రూ.200 కోట్లు), ఆరో స్థానంలో రోహిణి నీలేకని (రూ.142 కోట్లు), ఏడో స్థానంలో బజాజ్‌ ఆటో చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ (రూ.131 కోట్లు), ఎనిమిదో స్థానంలో పూనావాలా గ్రూప్‌ చైర్మన్‌ సైరస్‌ ఎస్‌ పూనావాలా (రూ.117 కోట్లు), తొమ్మిదో స్థానంలో వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ (రూ.113 కోట్లు), పదో స్థానంలో అదానీ గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ గౌతమ్‌ అదానీ (రూ.84 కోట్లు) ఉన్నారు.
*విరాళం ఇచ్చిన వారిలో విద్య (59 మంది) కోసం ఎక్కువ మంది ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాతి స్థానాల్లో ఆరోగ్య సంరక్షణ (53 మంది), కళలు, సంస్కృతి, వారసత్వం (18 మంది) ఉన్నాయి.
* అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి 44వ స్థానంలో నిలిచారు.


views: 609

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams