Current Affairs Telugu Daily

ఇరువురికి బూక‌ర్ ప్రైజ్

*ఆంగ్ల సాహిత్య ర‌చ‌యిత‌ల‌కు ఇచ్చే బూక‌ర్ ప్రైజ్ ఈ సంవత్సరం మార్గ‌రెట్ ఆట్‌వుడ్‌(79 సంవత్సరాల వయస్సు), బెర్నార్డినీ ఎవ‌రిస్టోల‌కు లభించింది.ఫిక్ష‌న్ క్యాట‌గిరీలో ఇద్ద‌రు ర‌చ‌యిత‌ల‌కు బూక‌ర్ ప్రైజ్‌ను ప్ర‌క‌టించ‌డం ఇదే మొద‌టిసారి. 
* ఆట్‌వుడ్ రాసిన -- ద టెస్టామెంట్స్‌
* ఎవ‌రిస్టో రాసిన --- గ‌ర్ల్‌, వుమెన్‌, అద‌ర్ న‌వ‌ల‌ల‌కు అవార్డు లభించింది. 
*ఈ ఇద్ద‌రూ 50వేల పౌండ్ల ప్రైజ్‌మ‌నీ పంచుకుంటారు.
*తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్న న‌ల్ల‌జాతి మ‌హిళ‌ ఎవ‌రిస్టో.
*ప్ర‌తి ఏడాది బూక‌ర్ ప్రైజ్‌ను ఒక్క‌రికి మాత్ర‌మే ప్ర‌క‌టిస్తారు. కానీ ఈసారి ప్యాన‌ల్ జ‌డ్జీలు బ‌హుమ‌తిని ఇద్ద‌రికీ పంచేందుకు నిర్ణ‌యించారు.
*మాన్ బుకర్ బహుమతి (Man Booker Prize) లేదా బుకర్ బహుమతి (Booker Prize) -------ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు మరియు జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం.
*1993 సంవత్సరంలో బుకర్ ఆఫ్ బుకర్ బహుమతి మిడ్‌నైట్స్ చిల్డ్రన్ రచయిత సల్మాన్ రష్దీ కి బహుకరించారు. దీనికే 2008 సంవత్సరంలో అత్యుత్తమ బుకర్ బహుమతి ని కూడా ఇచ్చారు.2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగా యొక్క మొట్టమొదటి రచన ది వైట్ టైగర్ కి లభించింది.
*ఈ బహుమతి దానిని స్పాన్సర్ చేసిన సంస్థ అయిన బుకర్-మెక్ కోనెల్ (Booker-McConnell) పేరు మీద బుకర్-మెక్ కోనెల్ బహుమతిగా 1968 సంవత్సరంలో మొదలైంది. అయితే బుకర్ బహుమతిగానే ప్రసిద్ధిచెందింది. దీని నిర్వహణ 2002 సంవత్సరంలో 'బుకర్ బహుమతి ఫౌండేషన్'కు బదిలీ చేయబడింది. దీనిని స్పాన్సర్ చేసిన మాన్ గ్రూపు (Man Group) బుకర్ పేరును ఉంచి ముందు తమ పేరును చేర్చి మాన్ బుకర్ బహుమతి అధికార నామంగా మార్చింది. అంతకు ముందు ఇచ్చే £21,000 పౌండ్ల బహుమతి మొత్తాన్ని £50,000కి పెంచింది. 


views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams