Current Affairs Telugu Daily

ప్రవాస భారతీయుడు అభిజిత్‌ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం

*ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్‌ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది. 
* అభిజిత్, ఆయన భార్య ఎస్తర్‌ డఫ్లో, మరో అమెరికన్‌ ఆర్థికవేత్త మైకేల్‌ క్రెమెర్‌లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకుంటారు.భార్యతో కలిసి ఒక ప్రవాస భారతీయుడు అర్థశాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోవడం ఇది ప్రథమం. 
*ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని పొందిన రెండో మహిళ డఫ్లో.
*ఈ పురస్కారం కింద తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదు, ఒక బంగారు పతకం, డిప్లొమా అందిస్తారు.
*భారతీయులు- నోబెల్ 
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ (సాహిత్యం, 1913)
సీవీ రామన్‌ (భౌతికశాస్త్రం, 1930)
హర గోవింద్‌ ఖురానా (ఇండియన్‌  అమెరికన్‌), వైద్యం, 1968
మదర్‌ థెరిసా (శాంతి పురస్కారం, 1979)
సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ (ఇండియన్‌ అమెరికన్‌), భౌతికశాస్త్రం, 1983
అమర్త్యసేన్‌ (ఆర్థికశాస్త్రం, 1998)
వెంకటరామన్‌ రామకృష్ణన్,(రసాయనశాస్త్రం, 2009)
కైలాస్‌ సత్యార్థి (శాంతి పురస్కారం, 2014)
అభిజిత్‌ బెనర్జీ (ఇండియన్‌ అమెరికన్‌), ఆర్థికశాస్త్రం, 2019
*అభిజిత్‌ బెనర్జీ ----పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్‌ నిర్మల, దీపక్‌ బెనర్జీలకు కోల్‌కతాలో 1961లో అభిజిత్‌ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఉన్నతాభ్యాసం కోసం అమెరికా వెళ్లి 1988లో హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 2003లో ఎస్తర్‌ డఫ్లోతో కలిసి అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పోవర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జే–పాల్‌)ను స్థాపించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మాసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
* ఎస్తర్‌ డఫ్లో --  ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం, పరిపాలన వంటి పలు రంగాల్లో పనిచేశారు. 47 ఏళ్ల వయసుకే అవార్డు దక్కించుకొని అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.


views: 656

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams