Current Affairs Telugu Daily

ఎక్స్ క్లూజివ్ ఎడ్యుకేషన్ జోన్ 

*నీతి ఆయోగ్,  ప్రపంచవ్యాప్తంగా  ఉన్న విదేశీ విద్యార్థులను  భారత్ లో విద్యను అభ్యసించేందుకు వివిధ సదుపాయాలను  భారత్ లో కనిపించేందుకు ప్రయత్నిస్తుంది. 2023 నాటికి రెండు లక్షల మంది విదేశీ విద్యార్థులను  భారతదేశంలో .ఎక్స్ క్లూజివ్ ఎడ్యుకేషన్ జోన్ 
 ఏర్పాటు చేయడం ద్వారా  ఇక్కడ చదువుకునేలా చేయడం  నీతి అయోగ్ లక్ష్యం. 
*అలాగే భారత్లో విదేశీ  విశ్వవిద్యాలయాల ఏర్పటు కు కృషి చేస్తోంది. 
*ఎక్స్ క్లూజివ్ ఎడ్యుకేషన్ జోన్  -- దీనిని కొన్ని ముఖ్యమైన నగరాలైన   బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్,పూణే , చండీగర్ ,సిక్కిం ల లో ఏర్పాటు చేస్తారు. ఇందులో  సాంకేతిక విద్య మరియు స్వల్పకాలిక ఒకేషనల్ కోర్సులను అందిస్తారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం ,2007-08 నుండి విదేశీ విద్యార్థుల రాక 2017-18  సంవత్సరానికి 2% నుండి 0.78 % ని కి తగ్గింది.
నీతి ఆయోగ్-భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి (N.I.T.I.). దీనిని తెలుగులో భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈవో ఉంటారు. భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరినీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్రమంత్రుల నుంచి నలుగురు దీనిలో సభ్యులుగా ఉంటారు.


views: 682

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams