Current Affairs Telugu Daily

సహజ వాయువు మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు

*సహజ వాయువు సరఫరా, పంపిణీ మౌలిక సదుపాయాల కోసం కేంద్రం 6,000 కోట్ల డాలర్ల (రూ.4.20 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. 
* కేంద్ర చమురు శాఖ మంత్రి  - ధర్మేంద్ర ప్రధాన్‌
*లక్ష్యం - ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను రెండింతలకు పైగా పెంచి 2030 నాటికి 15 శాతానికి చేర్చడం.
*మొత్తం ఇంధన వినియోగంలో ప్రస్తుతం సహజ వాయువు వాటా 6.2 శాతంగా ఉంది.భారత్‌ను గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ  లక్ష్యం.
*కర్బన ఉద్గారాలను తగ్గించడం లో  గ్యాస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
*దేశవ్యాప్తంగా సహజ వాయువు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది.
*సహజ వాయువు మౌలిక సదుపాయాలను ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు అనుసంధానం చేయనున్నారు.
*. 6,000 కోట్ల డాలర్లతో గ్యాస్‌ పైప్‌లైన్‌, టెర్మినల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
*ఈ రంగంలో దేశ, విదేశీ ప్రైవేటు పెట్టుబడుల అవసరం ఉంది.2024నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.ఇందులో ఇంధనం వాటా చాలా ముఖ్యం.
*అంతర్జాతీయ మార్కె ట్లో చాలా విధ్వంసకర పరిణామాలు ,ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితి, సవాళ్లు ఇటీవల ఎదురయ్యాయి. ఇరాన్‌, వెనిజులాపై అమెరికా ఆంక్షలు విధించడం, సౌదీ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై దాడి, పశ్చిమాసియాలో అనిశ్చితి, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి పరిణామాలు చమురు ధరలపై ప్రభావం చూపాయి. 
*ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై భారత్‌ ఆధారపడి ఉంది,దేశీయ వినియోగంలో ముడిచమురు దిగుమతి వాటా 84 శాతం, సహజ వాయువు వాటా 45 శాతంగా ఉంది. 


views: 602

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams